మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. లక్ష్యానికి చేరువలో ఉన్నారు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. మంగళవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు. అధికారులకు హోదామార్పు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీదైన రంగంలో మంచి ఫలితాలున్నాయి. లక్ష్యానికి చేరువవుతారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. గురువారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఒత్తిళ్లకు గురికావద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సుచేస్తారు. ప్రైవేట్ ఉద్యోగులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ముఖ్యులకు స్వాగతం పలుకుతారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
లక్ష్యం నెరవేరుతుంది. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. అర్ధాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అతికష్టంమ్మీద అవసరాలు తీరుతాయి. శనివారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిధైర్యంతో యత్నాలు సాగిస్తారు. కలిసివచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. వ్యాపారంలో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. అనుకున్న మొక్కులు తక్షణం తీర్చుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహస్థితి బాగుంది. ఆలోచనలు క్రియారూపంలో పెట్టండి. మీ లక్ష్యం త్వరలో నెరవేరుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు విపరీతం. స్థిరాస్థి రాబడిపై దృష్టి పెడతారు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆది. సోమ వారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. వాదోపవాదాలకు దిగవద్దు. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. గృహ అలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. ఇతరుల విషయాలు పట్టించుకోవద్దు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. సాఫ్ట్వేర్ రంగ విద్యార్థులకు సదవకాశాలు లభిస్తాయి.
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ వారం కొంతమేరకు అనుకూలం. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. పనులు ప్రారంభించే సమయానికి ఆటంకాలెదురవుతాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. పరిచయస్తులతో కాలక్షేపం చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపుల స్థలమార్పు అనివార్యం. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధవహించండి. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి. నిర్మాణాలు ఊపందుకుంటాయి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యదీక్షతో చేసే యత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. మీ శ్రీమతి ప్రోత్సాహం ఉంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. స్థిరచరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. బంధుమిత్రులతో తరచు కాలక్షేపం చేస్తారు. కార్యసాధనకు మరింత శ్రమించాలి. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. సోదరుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోండి. ఉపాధ్యాయులకు పదోన్నతి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల్లో పురోగతిన సాగుతాయి. సాఫ్ట్వేర్ విద్యార్థులకు సదవకాశాలు లభిస్తాయి. బెట్టింగ్ల జోలికి పోవద్దు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు ధృఢసంకల్పంతో శ్రమించండి. సాయం కోసం ఎదురుచూడవద్దు. స్వశక్తితోనే లక్ష్యం సాధిస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది. గురువారం నాడు ఆప్తుల కలయిక వీలుపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి చొరవతో ఒక అవసరం నెరవేరుతుంది. సంతానం కదలికలపై దృష్టిసారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. గృహమార్పు అనివార్యం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రైవేట్ ఉద్యోగస్తులకు నిరాశాజనకం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. సన్మాన, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ధృఢసంకల్పంతో శ్రమిస్తే విజయం తధ్యం. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. విమర్శలు, వ్యాఖులు పట్టించుకోవద్దు. స్థిరచరాస్తి మూలక ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం చేస్తారు. అర్ధాంతంగా ముగించిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా. మెలగండి. సోమవారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేసే వారున్నారని గమనించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యానికి చేరువలో ఉన్నారు. సంకల్పబలంతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పెద్దమొత్తం చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు మొదలు పెట్టే సమయానికి ఆటంకాలెదురవుతాయి. శకునాలు పట్టించుకోవద్దు. మంగళవారం నాడు ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. పెద్దల వ్యాఖ్యలు మీపై ప్రభావం చూపుతాయి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో పునరాలోచన శ్రేయస్కరం. ఆత్యీయులకు మీ సమస్యను తెలియజేయండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. గృహనిర్మాణానికి ప్లాన్ ఆమోదం పొందుతుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. మీ లక్ష్యం త్వరలోనే నెరవేరుతుంది. సన్నిహితుల వ్యాఖ్యలు ప్రభావితం చేస్తాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదాల చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఆప్తులతో తరచు సంభాషిస్తారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. వాహనదారులకు కొత్త సమస్యలెదురవుతాయి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులతో సతమతమవుతారు. కార్యం సాధించేవరకు శ్రమించండి. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. కొంతమొత్తం ధనం అందుతుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. చిట్స్, ఫైనాన్సు రంగాల జోలికి పోవద్దు. ప్రభుత్వ సంస్థల్లోనే పెట్టుబడులు శ్రేయస్కరం. శుక్రవారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటం శ్రేయస్కరం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. గృహాలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలనుర భర్తీ చేసుకుంటారు. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశావహదృక్పథంతో ముందుకు సాగండి. సంకల్పబలంతో శ్రమిస్తేనే లక్ష్యం సాధ్యం. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే. యత్నాలు విరమించుకోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆర్భాటాలకు వివరీతంగా ఖర్చుచేస్తారు. సోమవారం కొందరి రాక అసౌకర్యం కలిగిస్తుంది. కార్యక్రమాలు, పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఒక సమాచాం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం యత్నం ఫలిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. వస్త్రవ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ముఖ్యం. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.