శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (19:22 IST)

బంగ్లాదే్శ్‌ను బెంబేలెత్తించిన భారత బౌలర్లు.. 149 రన్స్‌కే అలౌట్

Rajkot Test
చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ గురువారం జరుగుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు చేపట్టిన బంగ్లాదేశ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 149 పరుగులకు ఔట్ అయింది. దీంతో భారత్‌‍కు 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 
 
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా తలో రెండో వికెట్లు తీశారు. పటిష్టంగా ఉన్న భారత బౌలింగ్‌ ధాటికి బంగ్లా బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. 32 పరుగులు చేసిన షకీబ్ అల్ హాసన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 27 పరుగులతో మెహదీ హాసన్ మిరాజ్ నాటౌట్‌గా నిలిచాడు.
 
మిగతా బంగ్లాదేశ్‌ బ్యాటర్లో షాద్మాన్ ఇస్లామ్ 2, జాకీర్ హాసన్ 3, శాంటో 20, మొమీనుల్ 0, ముష్పీకర్ రహీం 8, లిట్టన్ దాస్ 22, హాసన్ మహ్మద్ 9, టాస్కిన్ అహ్మద్ 11, నహీద్ రానా 11 చొప్పున పరుగులు చేశారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌ ముగిసిన అనంతరం, భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. 
 
అయితే, రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేశారు. జైశ్వాల్ 10, రోహిత్ శర్మ 5, శుభమన్ గిల్ 3 (నాటౌట్), విరాట్ కోహ్లీ 17, రిషబ్ పంత్ 12 (నాటౌట్‌) చొప్పున పరుగులు చేశారు. ప్రస్తుతం గిల్, పంత్‌లు క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్, నఙిద్ రానా, హాసన్ మిర్జాలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.