శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 16 ఆగస్టు 2024 (11:48 IST)

శునకానికి సెల్యూట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Video)

Pawan Kalyan saluted the dog
దేశంలో, రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నచోట జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం శునకం ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చింది. అనంతరం ఆయనకు శునకం నమస్కారం చేసింది. వెంటనే డిప్యూటీ సీఎం పవన్ శునకానికి ప్రతినమస్కారం చేసి మూగజీవాల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.