శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 జులై 2024 (10:14 IST)

ప్రియురాలిని దూరం చేసిందని... మహిళను కత్తితో పొడిచిన ఉన్మాది (Video)

murder
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిని ఓ మహిళ తనకు దూరం చేయడాన్ని ఆ ప్రియుడు తట్టుకోలేకపోయాడు. దీంతో తన ప్రియురాలిని దూరం చేసిన మహిళపై పగ తీర్చుకున్నాడు. ఆమెను కత్తితో పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన బెంగుళూరు నగరంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ప్రియురాలిని దూరం చేసిన కృతి (24) అనే మహిళ బెంగళూరులోని ఓ పేయింగ్ గెస్ట్ హౌస్‌లో ఉంటుందన్న విషయం తెలుసుకున్న యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అమ్మాయి సహాయం కోసం అడగ్గా, పక్కనే ఉన్న అమ్మాయిలు పట్టించుకోకపోవడంతో కృతి మృతి చెందింది. యువకుడు తన ప్రియురాలిని తన నుండి దూరం చేసిందని కృతిపై దాడి చేసి, హత్య చేసినట్లు భావిస్తున్నారు.