శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 28 నవంబరు 2024 (15:12 IST)

ప్రియురాలిని హత్య చేసి ఆమె శవం పక్కనే 24 గంటలు, ఆ తర్వాత?

crime
బెంగళూరులో దారుణం జరిగింది. ప్రియురాలిని అత్యంత పాశవికంగా హత్య చేసిన ప్రియుడు ఆమె శవం పక్కనే 24 గంటలు గడిపాడు. పూర్తి వివరాలను చూస్తే... అస్సాంకు చెందిన 19 ఏళ్ల యువతి శనివారం తన ప్రియుడితో కలిసి బెంగళూరులోని సర్వీస్ అపార్ట్‌మెంట్ లాబీలోకి ప్రవేశించి నవ్వుతూ కనిపించింది. మూడు రోజుల తర్వాత పోలీసులు అదే అపార్ట్‌మెంట్‌లో ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
హోటల్లోకి రాక మునుపే హత్యకు ప్లాన్ చేసిన ఆమె ప్రియుడు ఇప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మాయా గొగోయ్ తన ప్రియుడు ఆరవ్ హర్నితో కలిసి బుక్ చేసిన సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. నవంబర్ 23న మధ్యాహ్నం వారు హోటల్లోకి ప్రవేశించినట్లు, మంగళవారం ఉదయం ఆమె ప్రియుడు మాత్రమే ఒంటరిగా బయలుదేరి వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం ఇందిరానగర్ ప్రాంతంలో అద్దెకు తీసుకున్న అపార్ట్‌మెంట్ నుండి బయటకు వెళ్లే ముందు నిందితుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో గొగోయ్‌ను పొడిచి చంపి, ఒక రోజంతా ఆమె మృతదేహంతో ఉన్నాడు. గదిలో లభించిన పత్రాలలో బాధితురాలి పేరు మాయా గొగోయ్ అని, ఆమె వయస్సు 19 సంవత్సరాలుగా గుర్తించారు. ఆమె శరీరంపై చాలా గాయాలు ఉన్నాయి, అత్యంత ప్రాణాంతకమైన గాయం ఆమె ఛాతీపై కత్తిపోటు కనిపిస్తోంది. నిందితుడు కేరళకు చెందినవాడని, అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడని పోలీసులు తెలిపారు.