శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 16 నవంబరు 2024 (19:37 IST)

కారులో ప్రియురాలుతో సర్పంచ్, డోర్ తీసి పిచ్చకొట్టుడు కొట్టిన భార్య (video)

wife beaten husband girl friend
తన భర్త మరో స్త్రీతో సంబంధం నెరపుతున్నాడని తెలుసుకున్నది ఆ భార్య. అంతే... అతడు వెళ్తున్న మార్గాన్ని అనుసరించింది. అతడు తిన్నగా ఓ చోట ఆపి తన కారులో ఓ యువతిని ఎక్కించుకుని బయలుదేరాడు. కారు ప్రధాన రోడ్డు ఎక్కుతున్న సమయంలో అతడి కారుకి ఎదురుగా అతడి భార్య వచ్చి నిలబడింది. అంతే..
 
నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లు కారు ఆపేసాడు. ఆమె వెంటనే ఫ్రంట్ డోర్ తీసి తన భర్త పక్క సీట్లో కూర్చున్న యువతిపై విరుచుకుపడింది. నా భర్తతో ఎందుకు తిరుగుతున్నావ్ అంటూ కేకలు పెడుతూ పిడిగుద్దులు వేసింది. అతడిని పెళ్లాడబోతున్నానంటూ ఆ యువతి చెప్పడంతో మరింత ఆగ్రహంతో భర్త ప్రియురాలిపై విరుచుకుపడింది భార్య. కారు నుంచి బైటకు లాగి అందరూ చూస్తుండగానే ఆమెపై దాడికి దిగింది.
 
ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో జరిగింది. సర్పంచ్ సాహిబ్ తన ప్రియురాలితో పట్టుబడ్డాడు, సాహిబ్ భార్య అతని ప్రియురాలిని తీవ్రంగా కొట్టింది. ఆ సమయంలో సర్పంచ్ చేష్టలుడిగి అలా చూస్తూ కారు సీట్లో కూర్చుండిపోయాడు.