శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (20:18 IST)

దీపావళి రోజున మారేడు పత్రితో లక్ష్మీదేవి పూజ చేస్తే?

Diwali
దీపావళి రోజున ఉదయాన్నే లేవడం తలస్నానం చేయడం మంచిది. కొత్త బట్టలు ధరించాలి. కాని పక్షంలో శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించడం మంచిది.
 
దీపావళి రోజున మద్యం, మాంసానికి దూరంగా వుండాలి. లక్ష్మీపూజ తప్పనిసరి. మద్యం పూట నిద్రపోకుండా వుండాలి. గుమ్మాలకు తోరణాలు కట్టాలి. పూజాగదిని శుభ్రంగా అలంకరించుకోవాలి. లక్ష్మీదేవికి పూజలు చేయాలి.  
 
అమ్మవారికి చేయవలసిన నైవేద్యంగా కొబ్బరికాయ, అరటి పండ్లు, పాయసం, నైవేద్యంగా సమర్పించవచ్చు. మారేడు పత్రి, తామరపువ్వుతో లక్ష్మీదేవిని పూజించడం మరింత శుభకరం. ఇంటి గుమ్మానికి దిష్టి తీసి గుమ్మడికాయను కొట్టడం చేయాలి.