శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (22:45 IST)

మసాలా టీ తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటో తెలుసా?

Masala Tea
మసాలా టీ. ఈ మసాలా టీ రుచి, వాసన కారణంగా భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. మసాలా టీ వివిధ రకాల అనారోగ్యాలను నివారిస్తుందని, ఆరోగ్యంగా ఉంచుతుందని విస్తృతంగా నమ్ముతారు. మసాలా టీ అనేది ఏలకులు, అల్లం, దాల్చినచెక్క, నల్ల మిరియాలు అనేక పదార్థాల మిశ్రమం. ఈ మసాలా టీ తాగితే కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము.
 
మసాలా టీ తాగుతుంటే శరీర వాపును తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం మసాలా టీకి వున్నది.
మసాలా టీ తాగితే అది జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
మసాలా టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కనుక ఆరోగ్యానికి మంచిది.
మసాలా టీ క్యాన్సర్‌ను నివారిస్తుందని చెబుతారు.
శరీర శక్తి స్థాయిలను పెంచి మేలు చేస్తుంది.