బుధవారం, 15 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 14 అక్టోబరు 2025 (17:19 IST)

సిద్ధు గారూ, మీరు నిజ జీవితంలో ఉమనైజరా?: లేడీ జర్నలిస్ట్ ప్రశ్న, ఎక్కడికి పోతున్నారు? (video)

Siddu Jonnalagadda
సిద్ధు జొన్నలగడ్డ మోస్ట్ ఎవైటెడ్ కమింగ్-ఆఫ్-ఏజ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా చిత్రం ప్రమోషన్ ఈవెంట్లో సినీ జర్నలిస్టులు చిత్ర యూనిట్ ను పలు ప్రశ్నలు వేసింది. చిత్రం గురించి ప్రశ్నలు వేస్తూనే... సిద్ధు గారూ, మీరు నిజ జీవితంలో ఉమనైజరా? అంటూ ఓ లేడీ జర్నలిస్ట్ ప్రశ్నించడంతో అక్కడివారంతా షాకయ్యారు. ఇలాంటి ప్రశ్నలు వేసే తీరు మారదా అంటూ సోషల్ మీడియాలో సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కథ కేవలం లవ్ ట్రయాంగిల్ మాత్రమే కాదు..ఇది మేల్ ఇగో, మోడరన్ ఎమోషన్ పై ఎమోషనల్ అడ్వంచర్‌గా వుంది. రచన, దర్శకత్వం రెండింటిలోనూ నీరజ కోన ఆకట్టుకున్నారు. డైలాగులు శక్తివంతంగా, లోతైన భావంతో వ్వున్నాయి. కథలో మెయిన్ ఎలిమెంట్ నేటి సమాజంలో చర్చనీయాంశమైన ఒక సెన్సిటివ్ టాపిక్ చుట్టూ తిరుగుతుంది.
 
సిద్ధు జొన్నలగడ్డ వన్ మాన్ షో అనిపించేంతగా తన నటన ఆకట్టుకున్నారు. కంట్రోల్, ఈగో, ఎమోషన్స్ తో కూడిన తన నటన నెక్స్ట్ లెవల్లో వుంది. వైవా హర్షాతో జరిగే డైలాగ్స్ అతని కాన్‌ఫ్లిక్ట్‌ని చక్కగా చూపించాయి. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఇంటెన్సిటీ అదిరిపోయాయి. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నాలతో సిద్ధు కెమిస్ట్రీ అద్భుతంగా వుంది. వైవా హర్షా తన కామెడీ ఇమేజ్‌కి భిన్నంగా, డిఫరెంట్ ఫ్రండ్ పాత్రలో మెప్పించారు.
 
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ..  ట్రైలర్లో ఏం చూసారో సినిమాలో కూడా అదే క్యారెక్టర్, టోన్ కనిపిస్తుంది. టిల్లు లాంటి క్యారెక్టర్ నుంచి బయటికి రావాలంటే ఇలాంటి సినిమాలు చేయాలి. టిల్లు ఇన్నోసెంట్. బట్ తెలుసు కదా అలా కాదు. ఇంటెలిజెంట్ క్యారెక్టర్. వరుణ్ క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. ఇది యూత్‌కి ఫ్యామిలీస్‌కి నచ్చే సినిమా అని అన్నారు.