శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 4 నవంబరు 2024 (18:33 IST)

అవకాడో పండు ఎందుకు తినాలి?

Avocado
అవకాడో. ఈ పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవకాడోలో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు సమృద్ధిగా ఉండుటవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
అవకాడోలో కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వు కారణంగా బరువు పెరిగే వారికి చాలా మంచి పండుగా పరిగణిస్తారు.
ఈ పండు కొవ్వులు, పిండి పదార్థాలకు మంచి మూలం
అవకాడోలో గుండె వ్యాదులను నివారించటంలో సహాయపడే బి6 ఫోలిక్ ఆమ్లం సమృద్దిగా ఉంటాయి.
అధిక మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండుటవల్ల గుండె స్ట్రోక్స్ నిరోధించడానికి మంచిదని భావిస్తారు.
అవకాడో పండు నూనెతో పొడి చర్మంపై మర్దన చేస్తే మచ్చలు తొలగుతాయి. 
అవకాడో నూనెను అనేక సౌందర్యసాధనాలలో ఉపయోగిస్తారు.
అవకాడోకి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసే శక్తి వుంది.
అవకాడో పండును ఆర్థరైటిస్ నొప్పి నివారణ కొరకు ఉపయోగిస్తారు.
అవకాడోలో యాంటి ఏజింగ్ లక్షణాలు ఉండుటవల్ల చర్మం తాజాగా, తక్కువ వయస్సు వారిగా కనపడేలా చేస్తుంది.