శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 11 సెప్టెంబరు 2024 (12:57 IST)

డెంగ్యూ జ్వరంతో రక్తంలో పడిపోయిన ప్లేట్‌లెట్లు పెంచుకునే మార్గం ఇదే

papaya fruit
ఏదైనా తీవ్రమైన అనారోగ్యం బారిన పడినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోతాయి. ప్లేట్‌లెట్లు పెరగడానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. అందుకోసం ఏమేమి తినాలో ఇప్పుడు తెలుసుకుందాము.

బొప్పాయి ఆకులు కాస్త చేదుగా ఉన్నప్పటికీ వీటిని తింటే 24 గంటల్లో ప్లేట్‌లెట్‌ కౌంట్‌లో పెరుగుదల కనిపిస్తుంది.
ప్రతీ రోజూ అరకప్పు గోధుమ గడ్డి రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసుకుని తాగితే ప్లేట్లెట్లు పెరుగుతాయి.
రక్తంలోని ప్లేట్‌లెట్ల కౌంట్‌ పెరగడానికి దానిమ్మ గింజలు దోహదం చేస్తాయని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది.
గుమ్మడికాయలో విటమిన్‌ ఎతో పాటు ప్లేట్‌లెట్లను పెంచి, రెగ్యులేట్‌ చేసే లక్షణాలున్నాయి కనుక దీన్ని తీసుకోవాలి.
నిమ్మ, కమలాఫలం, కివీ, పాలకూర, ఉసిరి, బ్రొకోలీల్లో విటమిన్‌ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇవి ప్లేట్‌లెట్లను పెంపు చేస్తాయి.
వారంలో రెండుసార్లు ఒక చిన్న గిన్నెడు క్యారెట్‌, బీట్‌రూట్‌ను సలాడ్‌గా కానీ జ్యూస్‌ రూపంలోగానీ తీసుకుంటే రక్తంలో ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.