శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2024 (21:07 IST)

Redmi 13C 5Gపై భారీ డిస్కౌంట్.. ధర రూ.8,999లకే లభ్యం

Redmi 13C 5G
Redmi 13C 5G
రెడ్ మీ నుంచి కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చింది. గతంలో విడుదల చేసిన రెడ్ మీ 13 మోడల్‌కు అప్డేట్ వేరియంట్‌గా Redmi 13C 5G అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది అద్భుతమైన కెమెరా సెట్ అప్‌తో పాటు ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంది. అలాగే శక్తివంతమైన ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ఈ Redmi 13C 5G  స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 
 
ఇందులోని మొదటి వేరియంట్ 4GB ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరీస్‌తో లభిస్తుంది. ఇక రెండవ వేరియంట్ 6 జిబి ర్యామ్, మూడవ వేరియెంట్ 8 జిబి ర్యామ్‌లలో అందుబాటులో ఉంది. తొలి వేరియంట్‌పై అద్భుతమైన డిస్కౌంట్ లభించనుంది. 
 
ఈ మొబైల్ అసలు ధర రూ.13,999 కాగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లో భాగంగా 36% తగ్గింపుతో కేవలం రూ.8,999లకే పొందవచ్చు.