శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 నవంబరు 2024 (12:21 IST)

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. పది మంది శిశువులు సజీవ దహనం

UP
UP
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఝాన్సీలో ఉన్న మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో చిన్నారుల వార్డులో అర్థరాత్రి మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో పది మంది శిశువులు సజీవ దహనమయ్యారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆసుపత్రిలోని రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు రక్షించుకునేందుకు బయటకు పరుగులు తీయగా.. స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. 
 
ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. వార్డు తలుపులు, కిటికీలు పగులగొట్టి 37మంది చిన్నారులను బయటకు తీశారు. ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలో 47 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి పది మంది అభశుభం తెలియని శిశువులు సజీవ దహనమయ్యారు.