శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 15 నవంబరు 2024 (13:13 IST)

Dehradun Car Accident: మద్యం తాగి గంటకు 180 కి.మీ వేగంతో కారు, ఆరుగురు మృతి (video)

Dehradun Car Accident
కర్టెసి-ట్విట్టర్
డెహ్రాడూన్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ఆరుగురు యువతీయువకులు మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 180 కి.మీ వేగంతో నడిచినట్లు విచారణలో తేలింది. టయోటా కంపెనీకి చెందిన టెక్నికల్ టీమ్ యాక్సిడెంట్ జరిగిన కారుపై విచారణ జరిపి తన నివేదికను పోలీసులకు సమర్పించింది. ప్రమాదానికి ముందు యువత మద్యం సేవించి డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. 
 
జఖాన్ నుండి రాజ్‌పూర్ రోడ్, ఘంటాఘర్, చక్రతా రోడ్, బల్లూపూర్ చౌక్ మీదుగా ఒఎన్‌జిసి చౌక్‌కు 10 కి.మీ ప్రయాణంలో ఇన్నోవా కారు ఐదు పోలీసు చెకింగ్ అడ్డంకులను దాటింది. కారు కొత్తది- రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కూడా లేదు, కానీ కారు ఎక్కడా ఆపలేదు. హద్దులేని వేగంతో వెళుతోంది. రాజ్‌పూర్ రోడ్డులో ఘంటాఘర్ వైపు కారు అతివేగంతో వెళ్లడాన్ని పసిఫిక్ మాల్‌లోని ఓ ఉద్యోగి గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. ఐతే అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మంగళవారం ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు, రవాణా శాఖ కూడా కారు గంటకు 140 కి.మీ కంటే ఎక్కువ వేగంతో నడుస్తోందని పేర్కొంటుండగా, సోమవారం టయోటా కంపెనీ టెక్నికల్ టీమ్ ఆ సమయంలో కారు వేగం 180 కి.మీ వున్నట్లు స్పష్టం చేసింది. 
 
మరణానికి ముందు మద్యం తాగుతూ డ్యాన్స్
సోమవారం అర్థరాత్రి ఆరుగురు యువతీయువకులు అకాల మరణానికి గురయ్యారు. వారిలో ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి అరగంట ముందు తీసిన వీడియో బుధవారం ఇంటర్నెట్ మీడియాలో హల్ చల్ చేసింది. ప్రమాదంలో గాయపడిన సిద్ధేష్ అగర్వాల్ మొబైల్ ఫోన్ నుండి పోలీసులకు అతని స్నేహితులందరూ జఖాన్‌లోని సిద్ధేష్ ఇంట్లో డ్యాన్స్, పాటలు, సంబరాలు చేసుకుంటున్న వీడియోను గమనించారు. ఆ వీడియోలో వారు మద్యం సేవిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోంది.