శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జూన్ 2024 (10:13 IST)

తమిళనాడులో నాటుసారా తాగి 30 మంది మృతి- స్టాలిన్ సీరియస్

తమిళనాడులో నాటుసారా 30 మంది ప్రాణాలను బలిగొంది. కల్లకురిచి జిల్లాలో జరిగిన ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు కల్లకురిచి జిల్లా కలెక్టర్ శ్రావణ్‌కుమార్ జటావత్‌ను బదిలీ చేసి, ఎస్పీ సామే సింగ్ మీనాను సస్పెండ్ చేశారు. ఘటనపై సీబీ-సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు.
 
మృతుల్లో చాలామంది దినసరి కూలీలే. వారిలో మహిళలు కూడా ఉన్నారు. ప్యాకెట్లలో విక్రయించిన సారాను తాగిన బాధితులు ఆస్పత్రి పాలయ్యారు. ఆపై 30మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సారాను విక్రయించే గోవిందరాజ్‌ని అరెస్ట్ చేశారు. అతడి నుంచి 200 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.