సోమవారం, 10 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 నవంబరు 2025 (16:15 IST)

Bengaluru Prison Scandal: బెంగళూరు జైలులో మందులు చిందులు వీడియో వైరల్

Parappana
Parappana
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో బందీగా ఉన్న మోస్ట్‌ వాంటేడ్‌ క్రిమినల్, ఐసిస్‌ రిక్రూటర్‌ వీఐపీ సౌకర్యాలు పొందుతున్నట్లు కనిపిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా అదే జైలులో మద్యం తాగుతూ పార్టీ చేసుకుంటున్న మరో వీడియో బయటకు వచ్చింది. దీంతో జైలు అధికారులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీడియోలో జైలులోని ఖైదీలు పాటలు పాడుతూ,డ్యాన్సులు చేస్తూ, మందు పార్టీ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. 
 
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో పలువురు డేంజర్‌ సంఘటనలకు పాల్పడిన ఖదీలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే అనేక ప్రమాదకర ఘటనల్లో నిందితులుగా ఉన్న ఖైదీలకు జైలులో వీఐపీ సౌకర్యాలు కల్పించినట్లు కనిపిస్తున్న వీడియో ఆదివారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
అందులో సీరియల్ రేపిస్ట్ ఉమేష్ రెడ్డి, అనుమానిత ఐసిస్ రిక్రూటర్ జైలులో ఫోన్‌ వాడుతున్న దృశ్యాలు కూడా కనిపించాయి. అయితే ఈ విషయంపై స్పందించిన అధికారులు ఐసిస్‌ రిక్రూటర్‌కు జైలులో ఫోన్‌, టీవీ వంటి సౌకర్యాలు కల్పించినట్లు ఉన్న వీడియో ఇప్పటిది కాదని.. 2023 నాటిదని పేర్కొన్నారు. 
 
తాజాగా వైరలైన దృశ్యాలు మాత్రం వారం క్రితం తీసినట్లు తెలుస్తోంది. బెంగళూరు జైలుకు సంబంధించిన వరుస వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.