బుధవారం, 12 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By దేవీ
Last Updated : సోమవారం, 10 నవంబరు 2025 (18:01 IST)

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

SS Dushyant, Ashika Ranganath
SS Dushyant, Ashika Ranganath
ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవ. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల చేయనున్నారు.
 
ఈ రోజు ఫిల్మ్ ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ఇది నాలుగు విభిన్న కాలాలని చూపిస్తూ అద్భుతమైన ప్రపంచాన్ని ప్రజెంట్ చేసింది. ప్రారంభంలో పోర్చుగీస్ కాలానికి  విజువల్స్ ఆకట్టుకున్నాయి. పెద్ద నౌకలో రంధ్రం ఏర్పడి ప్రమాదంలో ఉన్న హీరో , అతని టీం కథని చూపించారు. ఆ తర్వాత కథ దేవలోకానికి మారుతుంది, అక్కడ ఒక ప్రేమకథ ఆకట్టుకుంది. తర్వాత రాజుల యుగంలోని గ్రామీణ ప్రేమకథలోకి మారుతుంది. తర్వాత ఆధునిక కాలానికి వస్తుంది. ఈ విభిన్న యుగాల్లోనూ హీరో-హీరోయిన్ల ప్రేమ ఎలా కొనసాగుతుందో, ప్రతి యుగంలో ఎదుర్కొనే సవాళ్లు ఎలా ఉంటాయో అద్భుతంగా చూపించారు. చివరికి వారు ప్రజెంట్ లో కలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
 
దర్శకుడు సునీ అంబీషస్ విజన్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. నలుగురు ఆర్ట్ డైరెక్టర్లు  శివకుమార్, ఉల్లాస్ హైదూర్, రఘు మైసూరు  ప్రతి యుగానికీ ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించి ప్రొడక్షన్ డిజైన్‌కి ప్రాణం పోశారు. విలియం జె. డేవిడ్ సినిమాటోగ్రఫీ విజువల్ డెప్త్‌తో ఆకట్టుకోగా, జూదా సాండీ సంగీతం ఎమోషన్ ని ఎలివేట్ చేసింది.
 
ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ తమ పాత్రలలో ఒదిగిపోయారు, ప్రతి యుగానికి తగిన లుక్‌,  కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు.
 
ప్రేక్షకులకు గొప్ప విజువల్ స్పెక్టకిల్‌ను అందించేలా రూపొందిన గత వైభవం లో VFX అద్భుతంగా వున్నాయి. ట్రైలర్ ప్రేమ, మైథాలజీ, పునర్జన్మ, పీరియడ్ డ్రామా ఎలిమెంట్స్ తో ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేలా ఉంది. ఈ చిత్రంపై ట్రైలర్ భారీ అంచనాలను నెలకొల్పింది.