మంగళవారం, 30 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 సెప్టెంబరు 2025 (12:48 IST)

హోంవర్క్ చేయలేదని విద్యార్థిని తాడుతో తలకిందులుగా వేలాడదీసి చెంపదెబ్బలు కొట్టించాడు

Student
Student
హోంవర్క్ చేయనందుకు రెండవ తరగతి విద్యార్థిని తాడుతో తలకిందులుగా కిటికీకి వేలాడదీసి కొట్టిన ఘటన కలకలం రేపుతోంది. హర్యానాలోని పానిపట్‌లో దారుణం జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్ ముందే చిన్న పిల్లలను సైతం దారుణంగా చెంపదెబ్బలు కొట్టిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. హర్యానా, ముఖిజా కాలనీకి చెందిన 7 ఏళ్ల బాలుడు ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. అయితే తాను ఇచ్చిన హోం వర్క్ పూర్తి చేసుకుని రాలేదని పాఠశాల ప్రిన్సిపల్ మందలించాడు. అతనికి పనిష్మెంట్ ఇచ్చే దిశగా.. విద్యార్థిని తాడుతో తలకిందులుగా వేలాడదీసి.. పిల్లలతో చెంపదెబ్బలు కొట్టించాడు. 
 
అయితే ఇదంతా తన స్నేహితులకు వీడియో కాల్ చేసి బాలుడు వివరించడంతో తల్లిదండ్రులు వెంటనే స్కూల్ కు వెళ్లి ఆరాతీయగా బాగోతం మొత్తం బయటపడింది. ఈ వ్యవహారం మొత్తం పోలీస్ స్టేషన్ కు చేరడంతో వేగంగా చర్యలు తీసుకున్నారు. పోలీసులు డ్రైవర్ అజయ్‌పై జువెనైల్ జస్టిస్ చట్టంలోని తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.