అత్యాచారం చేసి స్క్రూడ్రైవర్‌తో ప్రియురాలిని హత్య చేశాడు.. నిందితుడికి జీవిత ఖైదు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ప్రియురాలిని ఘోరంగా హత్య చేశాడు ఓ ప్రియుడు. తన ప్రియురాలు స్క్రూడ్రైవర్‌తో విచక్షణారహితంగా దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. 51సార్లు స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపేశాడు. ఈ కేసులో కోర్టు నిందితుడికి జీవితఖైదు విధించింది.
వివరాల్లోకి వెళితే.. పంప్ హౌస్ కాలనీలో నివాసం ఉంటున్న బాధితురాలు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. ఆమె స్కూల్ చదువుకునే రోజుల్లో ఆమె రోజూ బస్సులో స్కూల్‌కు వెళ్లేది.
ఆ సమయంలో ఆమెతో బస్సు కండక్టర్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. దీంతో వీరిద్ధరి మధ్య బంధం గట్టిపడి అది ప్రేమగా మారింది.
అయితే కొన్ని రోజుల తర్వాత సదురు యువకుడు యువతిని అనుమానించడం, వేధించడం స్టార్ట్ చేశాడు. యువతి ఒక్కతే ఇంట్లో ఉన్నట్టు నిందితుడు తెలుసుకున్నాడు. ఇక ఇంట్లోకి దూరి యువతిపై అత్యాచారం చేసి ఆ తర్వాత స్కూల్‌డ్రైవర్‌తో ఆమెను అతికిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసును విచారించిన కోర్టు జీవితఖైదు విధించింది.