గురువారం, 25 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2025 (18:20 IST)

Samyukta :హెల్తీ బాడీ అంటే స‌రైన మ‌జిల్స్ ఉండాలని ఇప్పుడు తెలుస్తుంది : సంయుక్త మీనన్

Samyukta Menon
Samyukta Menon
ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ కలర్స్ హెల్త్ కేర్ విశాఖపట్నంలో తన నూత‌న‌ బ్రాంచ్‌ను ప్రారంభించింది. రామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కలర్స్ హెల్త్ కేర్ 2.Oను హీరోయిన్  సంయుక్త మీనన్ ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన సౌకర్యాలను ఆమె పరిశీలించి, నిర్వాహకుల ప్రయత్నాలను అభినందించారు.
 
సంయుక్త మీనన్ మాట్లాడుతూ – ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రం విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌జ‌ల‌కు అందం, ఆరోగ్యం అందించేందుకు ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ను ప‌రిచ‌యం చేయ‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంది. నేను కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్పుడు వెయిట్ లాస్‌కు ఇప్పుడున్నంత టెక్నాల‌జీ లేదు. హెల్తీ బాడీ అంటే స‌రైన మ‌జిల్స్ ఉండాలని ఇప్పుడు తెలుస్తుంది. ఇటీవ‌ల ట్రెక్కింగ్ కోసం మేఘాల‌యా వెళ్లాను. ఆ జ‌ర్నీ నేను చాలా ఎంజాయ్ చేశాను. బ్రీతింగ్ స‌మ‌స్య కూడా లేదు. కానీ అక్క‌డ కొంత మందిలో స‌రిగ్గా బ్రీతింగ్ లేదు, ఆరోగ్యం స‌హ‌క‌రించ‌లేదు. ప్ర‌పంచంలోని ప‌లు ప్ర‌దేశాల‌ను చూడాలి, ప్ర‌కృతిని ఎంజాయ్ చేయాలంటే హెల్త్‌ను మెంటాయిన్ చేయాలి. 
 
ప్ర‌తి ఒక్క‌రూ ఫిట్‌గా ఉండాలలి అస‌ర‌మైన ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.  నాణ్యమైన సేవలను ఆధునిక టెక్నాలజీతో అందిస్తున్న కలర్స్ హెల్త్ కేర్‌కు అభినందనలు. దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న కలర్స్ హెల్త్ కేర్.. ఇప్పుడు విశాఖ ప్ర‌జ‌ల చెంత‌కు రావ‌డం ఆనందంగా ఉంది అని అన్నారు.