శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2024 (18:46 IST)

కౌరవ సభలా మారిన అసెంబ్లీ.. ద్రౌపదిలా మారిన జయలలిత.. కానీ తగ్గేదేలే!?

Jayalalithaa
Jayalalithaa
అసెంబ్లీలో మహిళల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలు ఇప్పుడిప్పుడే తమ ఉనికిని చాటుతున్నారు. గతంలో ఎన్నో అవమానకరమైన ఘటనలు అసెంబ్లీలలో జరిగాయి. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలితను నిండు సభలో అవమానించారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
 
1989లో అసెంబ్లీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వం దుర్మార్గం, అవినీతి చేస్తోందని ఓ మహిళా నాయకురాలు నిండు సభను ప్రశ్నించారు. ఆధారాలన్నీ చూపిస్తా అంటూ గట్టిగా అరిచారు. ఈ క్రమంలో ఆమెపై అధికార పార్టీకి చెందిన కొందరు ఒక్కసారిగా రెచ్చిపోయి ఎదురుదాడికి దిగారు. చివరికి జుట్టు పట్టుకుని కొట్టడానికి కూడా వచ్చారు. 
 
తీవ్రంగా అవమానించారు. అప్పటి వరకు అత్యంత గౌరవప్రదమైన అసెంబ్లీగా ఉన్న తమిళనాడు శాసనసభ ఆ ఒక్క సంఘటనతో కౌరవ సభగా మారింది.
 
 కౌరవులు, పాండవులు నిండిన సభలో తమిళనాడు అసెంబ్లీలో మహిళా నాయకురాలు జయలలిత ద్రౌపదిలా అవమానానికి గురయ్యారు. అదే సమయంలో ఆ మహిళా నాయకురాలు భీకర కెరటంలా ఏడ్చి అదే సభా వేదికపై పడి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టనని శపథం చేసింది. ఆఖరికి ఆ నిండు సభలో ప్రజల మన్ననలతో అఖండ మెజారిటీతో మళ్లీ ముఖ్యమంత్రిగా నిలిచారు.
 
ఆమె జీవితమంతా పోరాటమే. ఆమె ఎన్నో కష్టాలు, అవమానాలను ఎదుర్కొని తమిళ ప్రజల హృదయాలను గెలుచుకుంది. చివరకు జయలలిత అనే పేరు నుంచి అందరి చేత "అమ్మా" అని పిలుచుకునే స్థాయికి ఎదిగింది. జయలలిత జీవిత ప్రయాణం చాలామంది ప్రస్తుత రాజకీయ నేతలకు స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు.