శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మే 2024 (09:35 IST)

ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు

terrorist
ఈ నెల 19వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ నగరంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా దేశంలో ఆత్మాహుతి దాడులతో మారణహోమం సృష్టించేందుకు ప్రవేశించినట్టు వారివద్ద జరిపిన విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా, యాదులు, హిందూ దేవాలయాలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేసుకుని ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడాలన్న కృతనిశ్చయంతో వచ్చారు. ఈ నిందితులంతా శ్రీలంక జాతీయులుగా పోలీసులు గుర్తించారు. పైగా, పాకిస్థాన్‌లో కరుడుగట్టిన ఉగ్రవాది అబూతో టచ్‌లో ఉన్నట్టు తేలింది. 
 
గుజరాత్  పోలీసు శాఖకు చెందిన ఉగ్రవాద నిరోధక బృందం నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. నిందితులను ముహమ్మద్ నుస్రత్, ముహమ్మద్ ఫారిస్, ముహమ్మద్ రస్దీన్, ముహమ్మద్ నఫ్రాన్‌లుగా గుర్తించారు. శ్రీలంక జాతీయులైన వీరంతా కొలంబో నుంచి చెన్నైకు వచ్చి అక్కడ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు వీరు వచ్చినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 
 
భారత్‌లోని యాదులు, హిందూ దేవాలయాలతో పాటు కొందరు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రముఖులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు చేయాలనేది వీరి ప్లాన్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. పట్టుబడిన ఉగ్రవాదుల్లో ఒకరికి పాక్ వీసా కూడా ఉండటం గమనార్హం. భారత్‌‍లో కొందరితో ఉగ్రవాదులు సంప్రదింపులు జరిపివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.