శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2024 (22:33 IST)

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

ambulance
అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో ఇద్దరు కుమారులు తమ తండ్రి మృతదేహాన్ని మోటార్‌సైకిల్‌పై తుమకూరులోని శ్మశానవాటికకు తీసుకెళ్లవలసి వచ్చింది. ఈ సంఘటన నెట్‌లో వైరల్‌గా మారింది. ప్రభుత్వ వైద్య సౌకర్యాల కొరతపై ప్రజలు మండిపడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. హొన్నూరప్ప (80) వృద్ధాప్య సమస్యలతో వైఎన్ హోస్కోట్‌లోని గ్రామీణ ప్రభుత్వ కేంద్రంలో మంగళవారం మరణించారు. మృతదేహాన్ని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దళవాయిహళ్లి అనే అతని గ్రామానికి తరలించాల్సి వచ్చింది.

వైద్య సదుపాయంలో అంబులెన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, అంబులెన్స్ సిబ్బంది హొన్నూరప్ప మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి నిరాకరించారు. ఇందుకు కొంటిసాకులు చెప్పారు.

తమ వద్ద డబ్బులు సరిపోకపోవడంతో కుమారులు తమ తండ్రి మృతదేహాన్ని బైక్‌పై ఉంచి స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారులు పావగడ తాలూకా వైద్యాధికారిని నిలదీశారు.