పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా తీవ్రమవుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రస్థావరాలపై సైనిక చర్య చేపట్టింది. దీనికి ప్రతిగా దాయాది దేశం పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతోంది. వీటిని భారత్ ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది.
యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్ళతో పాక్ మిలిటరీ పోస్టులను ధ్వంసం చేసినట్టు తెలిపింది. దాడిలో పాక్ పోస్ట్ కుప్పకూలిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. అయితే, ఏ సెక్టార్‍లోని పోస్ట్‌ను నేల కూల్చారన్నది మాత్రం తెలియరాలేదు. సరిహద్దుల్లో పాక్ డ్రోన్ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతున్నాయి. ఇప్పటివరకు 50 డ్రోన్లను కూల్చివేసినట్టు సమాచారం.