శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 25 నవంబరు 2023 (16:32 IST)

తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోడీ

modi - tejous
తేజస్ యుద్ధ విమానంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించారు. బెంగుళూరులోని హెచ్.ఏ.ఎల్‌ను ఆయన శనివారం సందర్శించి, యుద్ధ విమానంలో చక్కర్లు కొట్టారు. ట్విన్ సీటర్ తేజస్ వార్ ఫ్లైట్‌లో జర్నీ చేశారు. ఈ ప్రయాణం తర్వాత ఆయన స్పందిస్తూ, మన స్వదేశీ సామర్థ్యంపై నమ్మకం పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
బెంగుళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్.ఏ.ఎల్)ను సందర్శించిన ప్రధాని అక్కడ కొనసాగుతున్న కార్యకలాపాలను, తయారీ యూనిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ట్విన్ సీటర్ తేజస్ విమానంలో ప్రయాణించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. 
 
ఈ సందర్భంగా మోడీ స్పందిస్తూ, తేజస్ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించానని చెప్పారు. ఇదొక గొప్ప అనువమని చెప్పారు. మన స్వదేశీ సామర్థ్యంపై తన నమ్మకం మరింత పెరిగిందని చెప్పారు. మన శక్తి సామర్థ్యాల పట్ల గర్వంగా ఉందని, ప్రపంచంలో మనం ఎవరికీ తక్కవ కాదనే విషయాన్ని గర్వంగా చెప్పగలనని వెల్లడించారు.