శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 మార్చి 2024 (10:32 IST)

వైట్ కింగ్ కోబ్రా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

White cobra
White cobra
అరుదైన తెల్లటి పాము పడగ విప్పి జనాలను భయాందోళనకు గురిచేసింది. రేర్ వైట్ కింగ్ కోబ్రా స్నేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో జంతువులకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 
తాజాగా, వైట్ కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది సోషల్ మీడియాలోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి తెల్లటి నాగుపాములు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ పామును చూస్తే చాలా మంది భయపడతారు. 
 
స్నేక్ ఫ్రెండ్ అనే వినియోగదారు ఈ తెల్లటి నాగుపాము వీడియోను షేర్ చేయగా, వందలాది మంది దీనిని వీక్షించి అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు.