మంగళవారం, 30 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 సెప్టెంబరు 2025 (10:00 IST)

Saharanpur: 11 ఏళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. పిండిమిల్లులోనే అఘాయిత్యం (video)

crime
crime
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహారన్ పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం ఎరుగని ఓ 11 ఏళ్ల చిన్నారిపై.. 80 ఏళ్ల వృద్దుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికంగా పిండి మిల్లు నిర్వహిస్తున్న వృద్దుడు ఆ పిండి మిల్లులోనే బాలిక‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
ఈ సంఘ‌ట‌నకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారడంతో స్థానికంగా కలకలం రేపింది. 80 ఏళ్ల వృద్ధుడికి పిండి మిల్లు ఉంది. ఇందులో 11 ఏళ్ల బాధిత బాలిక‌ను ప‌నిలో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే కామంతో రెచ్చిపోయిన ఆ వృద్ధుడు బాలిక‌పై అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. 
 
పిండిమిల్లులో  పనిచేస్తున్న బాలికను బలవంతంగా లోనికి లాక్కెల్లిన వృద్దుడు గ‌దిలోకి తీసుకెళ్లి బ‌ల‌వంతం చేశాడు. అతని నుంచి తప్పించుకోవడానికి బాలిక ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. 
 
ఈ ఘటనంతా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. కాగా  ఆ వృద్దుడు అంత‌కు ముందు కూడా చాలా సార్లు ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. పిండి మిల్లు రోడ్డు పక్కనే వున్నప్పటికీ కార్లు ఇతర బండ్లు నడుస్తున్నా ఎవరూ ఆ బాలిక అరుపులు పట్టించుకోలేదు.