శివ..శివ... శివభక్తుడుకి కర్రీలో చికెన్ ముక్క
ఇటీవలికాలంలో హోటల్ ఫుడ్ ఆరగించాలంటేనే కోరిక చచ్చిపోతోంది. హోటల్ ఆహారంలో పురుగులు, బల్లులు, ఎలుకలు బయటపడ్డ సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చౌబేపూర్‌లోని ఓ హోటల్‌లో భోజనం చేస్తున్న కస్టమర్‌కు (శివాలయంలో నిత్యం పూజలు, పునస్కారాలు చేసే శివభక్తుడు) తేరుకోలేని షాక్ తగిలింది. ఆయన ఆరగిస్తున్న రోటీలు, పన్నీర్ కర్రీలో చికెన్ ముక్క బయటపడింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
రాష్ట్రంలోని సదర్ కోత్వాలీ ఏరియాలోని మగర్ వారాకు చెందిన ధీరజ్ స్థానికంగా ఉండే శివాలయంలో నిత్యం సేవలు చేస్తూ ఉన్నాడు. శనివారం అతడు ఆన్‌లైన్ ద్వారా ఓ రెస్టారెంట్ నుంచి పన్నీర్ కర్రీ, రోటీలు ఆర్డర్ చేశాడు. వాటిని తింటుున్న అతడికి ఊహించని షాక్ తగిలింది. పనీర్ కర్రీలో చికెన్ ముక్క బయటపడింది. అతడు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశఆడు. పార్శిల్ తన దగ్గరకు వచ్చే సమయానికి ఓపెన్ చేసి ఉందని పేర్కొన్నారు.
కర్రీ తింటుండగా మాంసపు ముక్క రావడంతో షాక్ అయ్యానని చెప్పాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ధీరజ్ పోస్ట్ చేసిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు.