శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (10:35 IST)

వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలులో అద్భుతమైన ఫీచర్లు...

vande bharat sleeper
భారత రైల్వే వ్యవస్థ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుకుంది. ఈ సంస్థ తయారు చేసే రైళ్లు సరికొత్త రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో అద్బుతమైన ఫీచర్లను కల్పిస్తున్నారు. అయితే, ఈ వందే భారత్ రైళ్లలో కల్పించిన ఫీచర్లు అద్భుతం అనుకుంటే త్వరలో అంతకు మించి ఆకర్షణీయంగా వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు ఎక్కబోతున్నది. వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు సౌకర్యం, రక్షణ, కొత్తదనానికి చిరునామాగా ఉంటాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 
 
భారత్ ఎర్త్ మువర్స్ లిమిటెడ్, బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి అశ్విని వైష్ణవ్, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సొమన్న వందేభారత్ స్లీపర్ వెర్షన్ రైలును పరిచయం చేశారు. ఈ రైలుకు సంబంధించిన ఫోటోలను మంత్రి షేర్ చేస్తూ రైలు ప్రత్యేకతలు వివరించారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారి (లాంగ్ జర్నీ) కోసం ఈ రైలును తెస్తున్నారు. 
 
వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు ఏమిటంటే.. ఇది గంటకు 160 కిలో మీటర్ల వేగంతో వెళుతుంది. ఈ రైలుకి 16 కోచ్ లు ఉంటాయి. వీటిలో 11 ఏసీ త్రీ టైర్, 4ఏసీ టూ టైర్, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ ఉంటాయి. మొత్తం 823 ప్రయాణీకుల బెర్తులు ఉంటాయి. ఈ రైలులో అడ్వాన్స్‌డ్ లైటింగ్ అదిరిపోతుంది. యూఎస్‌బీ చార్జింగ్ ఉంటుంది. సుఖవంతమైన ప్రయాణం కోసం ప్రత్యేకంగా డాగ్ బాక్స్ కూడా ఉంటుంది. ప్రతి డైనింగ్ ట్రైలర్ రోచ్‌లో లగేజ్ ఉంచుకోవడానికి ఎక్కువ స్థలం (స్పేస్) ఉంటుంది.
 
ఈ రైలులో భారీ, మీడియం, స్మాల్ పాంట్రీస్‌లో తాజా లంచ్, డిన్నర్ అందుబాటులో ఉంటుంది. తినేందుకు వీలుగా రైలులో స్థిరమైన, మడతపెట్టేందుకు వీలుగా ఉండే స్నాక్ టేబుల్స్ ఉంటాయి. అందువల్ల డైనింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈఎస్ 45,545 ప్రకారం అగ్ని భద్రత, ప్రమాదాలను నిరోధించే సదుపాయం ఉంది. 
 
దివ్యాంగులకు అనుకూలమైన ప్రత్యేక బెర్తులు, టాయిలెట్లు, ఆటోమేటిక్ బాహ్య ప్రయాణీకుల తలుపులు, సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ తలుపులు, ఎండ్ వాల్ వద్ద రిమోట్‌గా పని చేసే ఫైర్ బారియర్ డోర్లు, సమర్థతాపరంగా రూపొందించిన వాసన లేని టాయిలెట్ వ్యవస్థ, పబ్లిక్ ప్రకటన దృశ్య సమాచార వ్యవస్థ వంటి ఫీచర్‌లు ఈ ట్రైన్‌లో ఉన్నాయి.