శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కోవిడ్‌తో భర్త మృతి - భర్త వీర్యంతో బిడ్డకు జన్మనిచ్చిన భార్య

baby boy
కరోనా వైరస్ మహమ్మారిబారినపడిన భర్త కన్నుమూశాడు. కానీ, అతని వీర్యంతో మృతుని భార్య ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని భీర్భూమ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని మురారై ప్రాంతానికి చెందిన సంగీత, అరుణ్ ప్రసాద్‌ అనే దంపతులకు 27 యేళ్ళ క్రితం వివాహమైంది. అయితే, సంగీతకు గర్భాశయ సమస్యల కారణంగా సంతానం కలగలేదు. దీంతో భర్త వీర్యంతో ఐవీఎస్ ద్వారా పిల్లల్ని కనాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకి రెండేళ్ల క్రితం అరుణ్ ప్రసాద్ కన్నుమూశారు. ఆయన మృతి చెందకముందే ఆయన వీర్యాన్ని సేకరించి కోల్‌కతా ఓ ల్యాబ్‌లో భద్రపరిచారు. 
 
ఆ తర్వాత కొన్ని రోజులకే అరుణ్ కరోనాతో మృతి చెందారు. భర్త మరణంతో ఒంటరిగా మారిన సంగీత భర్త వీర్యం భద్రంతో ఉండటంతో దాన్ని ద్వారా సంతానం కనాలని నిర్ణయించింది. వైద్యులను సంప్రదించి విషయం చెప్పడంతో ఐపీఎఫ్‌ పద్దతిలో ఆమె అండలోకి భర్త వీర్యాన్ని ప్రవేశపెట్టారు. అలా గర్భందాల్చిన ఆమె ఈ నెల 12న రాంపూర్ హాట్‌ వైద్య కళాశాలలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నడివయసులో బిడ్డకు జన్మనిచ్చినా తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.