శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2024 (14:18 IST)

తేనిలో వీధికుక్కల బెడద.. యువతికి చుక్కలు.. వీడియో వైరల్

Dogs
Dogs
హైదరాబాదులో వీధికుక్కల దాడికి ఓ బాలుడు మరణించిన సంఘటన తెలిసే వుంటుంది. హైదరాబాదునే కాదు.. తమిళనాడులోనూ వీధికుక్కలు జనాలకు భయం పెట్టిస్తున్నాయి. తాజాగా తమిళనాడు, తేనిలో వీధికుక్కలు వాహనం నడుపుతూ వచ్చిన ఓ యువతికి చుక్కలు చూపించాయి. ఆమెను కరిచేందుకు ఆమెపైకి దూసుకెళ్లాయి. 
 
ఆమె పెద్దగా అరుచుకుంటూ కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. శునకాలు ఆమెను వదిలిపెట్టలేదు. ఆ యువతిని కాపాడేందుకు మరో మహిళ కుక్కలను తరిమికొడుతూ కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
 
అలాగే తేని జిల్లా, అల్లినగరం మునిసిపల్‌ ప్రాంతాల్లో, రాత్రింబవళ్లు అనేక వీధి కుక్కల రోడ్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ వీధి కుక్కలు వీధుల్లో వెళ్లే స్కూల్ స్టూడెంట్స్, ప్రజలు, టీవీలరిస్టులు,  నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వ్యక్తులను వదిలిపెట్టట్లేదు. వీధికుక్కలకు భయపడుతూ రోడ్లపై నడుస్తున్నామని స్థానికులు వాపోతున్నారు.