శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2024 (17:07 IST)

వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయో తెలుసా?

Varahi Puja
వారాహి దేవి రూపం ఇంచు మించు వరాహ మూర్తినే పోలి ఉంటుంది. అమ్మవారి శరీరం నల్లని మేఘ వర్ణంలో ఉంటుంది. ఈ తల్లి వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హస్తాలతో శంఖం, పాశము, హలము, వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. 
 
గుర్రం, సింహం, పాము, దున్నపోతు వంటి వివిధ వాహానాల మీద ఈ అమ్మవారు సంచరిస్తుంది. లలితా దేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు. పూర్వం హిరాణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. 
 
ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహా పురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది. 
 
ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈ ఉగ్ర వారాహీ - కాశీ వారాహిదేవి అమ్మవారి పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. వారాహిదేవి సప్త మాతృకలలో ఒకరు.  
 
ఇక ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహీ అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులని.. గుహ్య నవరాత్రులని కూడా పిలుస్తుంటారు. వీటితో పాటు వారాహీ నవరాత్రి, శాకంబరి నవరాత్రి పేరిట పిలుస్తుంటారు. ఈసారి వారాహీ నవరాత్రులు.. ఆషాడ మాస ప్రారంభం నుండి అనగా... జులై 6 శనివారం 2024న ప్రారంభమై జులై 15 సోమవారం 2024న ముగుస్తాయి.