శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2024 (22:24 IST)

వినాయక చవితి 2024: 21 పత్రాలు.. ఎరుపు రంగు దుస్తులు..?

Vinayaka
అగ్రపూజ అందుకునే దేవుడు, విజ్ఞాలను తొలగించే వినాయకుడిని పూజిస్తే సర్వం సిద్ధిస్తుంది.  అదీ వినాయక చవితి రోజున గణపతికి 21 పత్రాలతో పాటు గరికలను సమర్పించాలి. గణనాథుడిని వినాయక చవితి రోజున 21 పత్రాలతో ఆరాధించడం ద్వారా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో తులతూగుతారని విశ్వాసం. వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాయక వ్రతాన్ని ఆచరించడం ద్వారా తమకుండేటటువంటి సమస్త విజ్ఞాలు తొలగిపోతాయి. 
 
గణేశ్​ చతుర్థిని ప్రతి సంవత్సరం భాద్రప్రద మాసం శుక్ల పక్షం చవితి రోజున జరుపుకుంటాం. ధృక్​ సిద్ధాంతం ప్రకారం సెప్టెంబర్​ 7వ తేదీ శనివారం రోజు వినాయక చవితి నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. 
 
వినాయకుడికి ఎరుపు రంగు వస్త్రాలంటే ప్రీతిపాత్రమని.. పండగ రోజున ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా.. వినాయక చవితి శనివారం వచ్చింది కాబట్టి.. శనివారానికి అధిపతి శనేశ్వరుడు కాబట్టి.. ఆయనకు ఇష్టమైన నీలం రంగు దుస్తులు ధరించినా మంచిదని చెబుతున్నారు.