బుధవారం, 8 అక్టోబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (18:41 IST)

సెప్టెంబర్‌ 21న సూర్యగ్రహణం: కన్యారాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు...

Surya Grahan
Surya Grahan
సెప్టెంబర్‌ 21న సూర్యగ్రహణం 2025 ఏర్పడనుంది. 2025 సెప్టెంబర్‌ 21వ తేదీన పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్‌ 21వ తేదీ రాత్రి 10.59 అంటే 11 గంటల నుంచి సెప్టెంబర్‌ 22 తెల్లవారుజామున 3.23 గంటలకు వరకు ఉంటుంది. ఇది రాత్రి పూట సంభవించడం వల్ల భారతదేశంలో కనిపించదు. 
 
ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సూర్య గ్రహణం ఉత్తర ఫల్గుణి నక్షత్రం కన్యా రాశిలో సంభవిస్తుంది. సూర్య గ్రహణం సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్యారాశిలో ఉంటారు. అలాగే.. శనీశ్వరుడు మీనరాశిలో ప్రత్యక్ష దృష్టిని కలిగి ఉంటారు. కుజుడు తులా రాశిలో, రాహువు కుంభ రాశిలో, బృహస్పతి మకర రాశిలో, శుక్రుడు, కేతువు కలిసి సింహ రాశిలో ఉంటారని పండితులు చెబుతున్నారు.
 
ఈ రాశులకు శుభ ప్రభావం 
సూర్యగ్రహణం వృషభరాశిపై చాలా శుభ ప్రభావాన్ని చూపుతుంది. విశ్వాసం పెరుగుతుంది. ప్రతి పనిలో అదృష్టం మీతో ఉంటుంది. వ్యాపారంలో కూడా భారీ లాభాలు ఉంటాయి. ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం సింహరాశి వారికి మంచిది.  బంగారం, వెండిని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. 
 
ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్లగలరు. సంవత్సరపు చివరి సూర్యగ్రహణం తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త భూమిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.