తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత
తిరుమల భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కీలక ప్రకటన చేసింది. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో.. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ కోటాను శుక్రవారం విడుదల చేయనుంది.
శ్రీవాణి ట్రస్ట్ దాతల కోటాను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండేలా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
మరోవైపు ఇప్పటికే తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం మొదటి మూడు రోజులు అంటే డిసెంబర్ 30, 31, జన్వరి 1 తేదీలకు ఇప్పటికే లక్కీడిప్‌ను ఆన్‌లైన్‌లలో కేటాయించారు. అయితే.. లక్కీ డీప్ లో తమ టోకెన్ రాని వారు చాలా మంది భక్తులు తమకు దర్శన భాగ్యం రాలేదని చాలా బాధపడుతున్నారు.
ఈ క్రమంలో వీరికి టీటీడీ మరో శుభవార్త చెప్పింది. ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించనున్నట్లు ప్రకటించింది.