బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (09:53 IST)

బాలాపూర్‌లో ముజ్రా.. ట్రాన్స్‌జెండర్స్‌తో వెర్రి వేషాలు.. అరెస్ట్

Dancers
Dancers
బాలాపూర్ పరిధిలోని అలీనగర్ ప్రాంతంలో స్థానికంగా ఉండే కొందరు నిత్యం ట్రాన్స్‌జెండర్స్‌ను పిలిచి ముజ్రా పార్టీ అంటూ వెర్రి వేషాలు వేస్తున్నారు. తప్పతాగి పెద్ద పెద్ద శబ్దాలతో చెవులకు చిల్లులు పడేలా స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు సోమవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ మహ్మద్ అమీర్ కుటుంబ వేడుకలను జరుపుకోవడానికి ‘ముజ్రా’ నిర్వహించిన ఇంటిపై దాడి చేశారు. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కార్యక్రమంలో నలుగురు ట్రాన్స్‌జెండర్స్‌ ఒక వేదికపై అశ్లీల నృత్యాలు చేశారు. బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ ఎం. సుధాకర్ మాట్లాడుతూ, పోలీసులు అమీర్‌కు నోటీసు జారీ చేసి, సాక్షులతో పాటు అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కార్యక్రమం నిర్వహించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
అసలు ముజ్రా పార్టీ అంటే.. ఏవైనా శుభ‌కార్యాల వేళ ట్రాన్స్‌జెండర్లతో డ్యాన్సులు, పలు కార్యక్రమాలు లాంటివి నిర్వహించడం.. కానీ, ఇక్కడ మాత్రం ట్రాన్స్‌జెండర్లను పిలిపించి వారిని అందంగా రెడీ చేయించి, వారు డాన్సులు చేస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తున్నారంటూ స్థానికులు చెబుతున్నారు.