శుక్రవారం, 17 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 అక్టోబరు 2025 (09:32 IST)

56 మంది పురుషులు - 20 మంది మహిళలతో రేవ్ పార్టీ ... ఎక్కడ?

rave party
హైదరాబాద్ నగరంలో మరోమారు రేవ్ పార్టీ కలకలం రేపింది. 56 మంది పురుషులు 20 మంది మహిళలు కలసి ఈ రేవ్ పార్టీని చేసుకున్నారు. ఈ రేవ్ పార్టీపై పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పాల్గొన్న వారంతా ఎరువుల తయారీ కంపెనీ యజమానులు కావడం గమనార్హం. ఈ యజమానుల కోసం 20 మంది అర్థనగ్న దుస్తుల్లో నృత్యం చేయించారు. 
 
పోలీసుల కథనం మేరకు.. రాక్‌స్టార్ ఫెర్టిలైజర్ యజమాని సైదారెడ్డి, వేద అగ్రి ఫెర్టిలైజర్‌కి చెందిన డీలర్ తిరుపతి రెడ్డి కలిసి ఫెర్టిలైజర్ యజమానుల కోసం ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఇది హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మహేశ్వరం మండలం కె.చంద్రారెడ్డి రిసార్టులో ఏర్పాటు చేశారు. 
 
ఇందులో 56 మంది ఫెర్టిలైజర్ కంపెనీల యజమానులు, 20 మంది మహిళలు పాల్గొన్నారు. వీరందరూ అర్థనగ్నంగా నృత్యం చేస్తుండగా, మహేశ్వరం పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మఫ్టీలో అక్కడకు వెళ్లిన పోలీసులు కాసేపు అక్కడే ఉండి తనిఖీలు చేశారు. ఈ రేవ్ పార్టీ కోసం ఉపయోగించిన విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్నవారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.