శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2024 (18:59 IST)

ముందస్తు సమాచారం ఇవ్వలేదు : బాధ్యులపై కఠిన చర్యలు : హైదరాబాద్ పోలీసులు

stampade
హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. బుధవారంే రాత్రి 9.40 సమయంలో 'పుష్ప 2' ప్రీమియర్ షో సంధ్య థియేటర్లో ఏర్పాటు చేశారని, దీనికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారని తెలిపారు. 
 
ప్రేక్షకులతోపాటు సినిమాలో నటించిన కీలక నటులు హాజరవుతారన్న ముందస్తు తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా మాకు ఆ సమాచారం ఇవ్వలేదన్నారు. దీనికోసం థియేటర్ యాజమాన్యం కూడా ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. 
 
ప్రేక్షకులను నియంత్రించేందుకు కూడా ఎలాంటి ప్రైవేటు భద్రతను ఏర్పాటు చేయలేదని, ఎంట్రీ ఎగ్జిట్‌లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని పేర్కొన్నారు. నటీనటుల కూడా ఎటువంటి ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయలేదని తెలిపారు. 9.30 గంటలకు తన వ్యక్తిగత భద్రత సిబ్బందితో సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ చేరుకున్నారని తెలిపారు. 
 
ఆ సమయంలో అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లిన సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను నెట్టి వేయడం ప్రారంభించారని, అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉందన్నారు. ఇదేసమయంలో థియేటర్లోని కింది అల్లు అర్జున్ కలిసి లోపలికి వెళ్లారని తెలిపారు. ప్రేక్షకులకు మధ్య తోపులాట చోటుచేసుకుందని పేర్కొన్నారు. ఇదేసమయంలో దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన రేవతి అతని కుమారుడుతో ఆ ప్రాంతంలో ఉందని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉండటంతో వారికి ఊపిరాడలేదన్నారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వారిని బయటకు లాగారని, 13 ఏళ్ల శ్రీతేజ్‌కు పోలీసులే సీఆర్పీ చేశారని తెలిపారు. 
 
రేవతి కుమారుడు శ్రీ తేజను దుర్గాబాయి దేశముఖ ఆసుపత్రి తరలించారనీ, రేవతి మాత్రం అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారని, శ్రీతేజను మరో ఆసుపత్రికి తరలించారని అక్కడ వైద్యులు సూచించారని తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. బిఎన్ఎస్ యాక్టీవ్‌లోని 105 118(1), రెడ్ విత్ త్3(5) సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు.