శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2024 (15:14 IST)

Allu Arjun Dialogue ఎవడ్రా బాస్... ఆడికి.. ఆడి కొడుక్కి... ఆడి తమ్ముడికి నేనే బాస్‌రా!

Pushpa 2
Allu Arjun’s Dialogue From Pushpa 2 Sets Internet On Fire అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన "పుష్ప-2" చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొత్తం ఆరు భాషల్లో విడుదలైన ఈ చిత్రంలోని కొన్ని డైలాగులు ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ డైలాగులను అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగా రాయించుకుని పెట్టారా? లేదా సన్నివేశానికి అనుగుణంగా దర్శకుడే అలాంటి డైలాగులను పెట్టారా అన్న చర్చ ఇపుడు జరుగుతుంది. ఈ డైలాగులు విన్న బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఖుషీ అవుతుంటే, మెగా ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. తమ బాస్ (మెగాస్టార్ చిరంజీవి)ను, ఆయన తనయుడు రామ్ చరణ్, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి చేసినవేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 
 
అల్లు అర్జున్ కావాలని ఈ డైలాగ్స్ రాయించుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్.. ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్' డైలాగ్ బాగా వైరల్ అవుతోంది. అలాగే ఒక‌డు ఎదుగుతుంటే చూడ‌లేక వాడు డౌన్ కావాల‌ని కోరుకునేవాళ్లు చాలా మందే ఉంటారు‌ అన్న డైలాగ్ కూడా బాగానే షేర్ అవుతుంది. ఎత్తులో ఉన్న‌ప్పుడు ఈగోలు ఉండ‌కూడ‌దు అనే డైలాగ్ కూడా అల్లు అర్జున్ ఇమేజ్ చూసి ఇగోలు చూపిస్తున్నవారిని టార్గెట్ చేసే విధంగా ఉందనే చర్చ సాగుతుంది. మొత్తంమీద పుష్ప-2 చిత్రం టాక్ ఎలా ఉన్నప్పటికీ ఇందులోని డైలాగులకు మాత్రం మంచి స్పందన వస్తుంది.