శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : ఆదివారం, 24 నవంబరు 2024 (21:22 IST)

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

రక్షించాల్సిన వాడే రాక్షసుడైతే ఇక ఎవరికి చెప్పుకోవాలి? ఇలాంటిదే హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ పరిధిలో చోటుచేసుకున్నది. తన భర్త తనను తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఓ బాధిత మహిళ హయత్ నగర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. సమస్యను విన్న స్టేషన్ ఎస్.ఐ ఆమె ఇబ్బందిని అవకాశంగా తీసుకున్నాడు.
 
నీ భర్తపై వేధింపుల కేసు నమోదు చేయాలంటే అంతకంటే ముందు నా కోరిక తీర్చు అంటూ ఆమెపై లైంగిక వేధింపులు మొదలుపెట్టాడు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదులోని ఫోన్ నెంబరుకి తరచుగా ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. ఫోనులో.. నీ కేసును నేను పరిష్కరిస్తాను. దానికి ప్రతిఫలంగా నువ్వు నా కోరిక తీర్చు చాలు. మీ ఇంటికి వస్తాను... అంటూ ఆమెకి పదేపదే ఫోన్లు చేయడంతో అతడి వేధింపులు తాళలేని మహిళ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకుని వెళ్లింది. దీనితో ఎస్.ఐ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.