శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2024 (22:14 IST)

తీహార్ జైలు నుంచి ఐదు నెలల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదల

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. కవిత రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్నారు. నేరుగా ఫామ్ హౌస్‌కు వెళ్లి తండ్రి కేసీఆర్‌ను కలుస్తారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరు నెలల క్రితం అరెస్టయిన కవితకు మంగళవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 
 
దీంతో ఆమె జైలు నుంచి ఐదు నెలల తర్వాత విడుదలయ్యారు. రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. బయటకు రాగానే తన కుటుంబ సభ్యులను చూసి ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
 
భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు జైలు నుంచి బయటకు వచ్చిన కవితకు స్వాగతం పలికారు. అనిల్, కేటీఆర్, కొడుకులను హత్తుకొని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. 
 
ఇకపోతే.. మార్చి 15న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం నుంచి ఈడీ కవితను అరెస్టు చేయగా, ఏప్రిల్ 11న తీహార్ జైలు నుంచి సీబీఐ అరెస్ట్ చేసింది.