శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2024 (20:21 IST)

కొండా సురేఖ, సీతక్క, రేవంత్ నోరును ఫినాయిల్‌తో కడగాలి- కేటీఆర్

ktrao
అక్కినేని నాగచైతన్య - సమంత విడిపోడానికి కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఇప్పటికే అక్కినేని నాగార్జున ఎక్స్ ద్వారా తీవ్రంగా ఖండించారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ముందుగా కొండా సురేఖ, సీతక్కలు సీఎం రేవంత్ నోరును ఫినాయిల్‌తో కడగాలని వ్యాఖ్యానించారు.
 
తమకు సంబంధం లేని వ్యవహారంలో కొండా సురేఖ మాపై ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నానని కొండా సురేఖ అనలేదా అని ప్రశ్నించారు. తనకు కుటుంబం.. భార్య.. పిల్లలు లేరా అంటూ నిలదీశారు. 
 
కొండా సురేఖపై సోషల్ మీడియా పోస్టింగ్‌లతో తమకు సంబంధం లేదని చెప్పారు. కొండా సురేఖ ఏడిస్తే మాకేమి సంబంధమని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో కేసీఆర్‌ను తిట్టిపోయలేదా అని నిలదీసారు. చేతకాకనే కాంగ్రెస్ తమపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. 
 
తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేకనే దాడులు చేయిస్తోందన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు సరి కాదని..విధాన పరమైన అంశాల పైనే మాట్లాడాలని సూచించారు.