శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2024 (16:19 IST)

సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో మహిళా అఘోరి పూజలు (video)

Agora
Agora
సికింద్రాబాద్‌లోని కుమ్మరి గూడలోని ముత్యాలమ్మ ఆలయాన్ని గురువారం ఒక మహిళా అఘోరి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ముత్యాలమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన కొద్ది రోజులకే అఘోరి ఈ ఆలయాన్ని సందర్శించడం సంచలనానికి దారి తీసింది. 
 
ఇప్పటికే ముత్యాలమ్మ విగ్రహాన్ని కూల్చిన ఘటనపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు, వివిధ హిందూ సంస్థలు నిరసనలు చేపట్టాయి. ఆలయ అధికారులు ఆలయ పవిత్రతను పునరుద్ధరించడానికి శుద్ధి కర్మలను ప్రారంభించారు.
 
ఈ ఉద్రిక్తతల మధ్య, ఓ అఘోరీ శుక్రవారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకుని, ఒంటికాలిపై నిలబడి.. పూజలు నిర్వహించడం విశేషంగా భక్తుల దృష్టిని ఆకర్షించింది. ముత్యాలమ్మ ఆలయంలో అఘోరీ పూజకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆన్‌లైన్‌లో ఈ ఘటనకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది.