శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (12:45 IST)

శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. కుటుంబం బలి

road accident
శుభకార్యానికి వెళ్లి ఆ కుటుంబం తిరుగు ప్రయాణం చేస్తుండగా యముడు ఆ కుటుంబాన్ని బలితీసుకున్నాడు. సంతోషంగా శుభకార్యానికి ముగించుకుని వస్తుండగా.. ఒకే కుటుంబానికి చెందిన వారంతా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 
 
అతివేగమే కుటుంబాన్ని బలి తీసుకుందని పోలీసులు తెలిపారు. వేగంగా వెళ్లిన ఓ కారు ఓ గుంతలో పడి ఎగిరి చెట్టును ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా రత్నాపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారంతా ఒక కుటుంబానికి చెందిన వారిగా గుర్తించామని తెలిపారు. 
 
ఒక శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై మృతి చెందిన తండ్రి శివరాం(56), తల్లి దుర్గి (50), పెద్ద కూతురు శాంతి (38), మూడో కూతురు అనిత (35), శాంతి కూతురు మమత (16), అనిత కూతుర్లు హిందు (12), శ్రావణి(10)లుగా గుర్తించారు. 
 
కారు నడిపిన పెద్దల్లుడు నాం సింగ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.