శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2024 (08:40 IST)

హైదరాబాద్ నగరంలో మంచినీటి సరఫరా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

charminar
హైదరాబాద్ నగరంలో మంచినీటి సరఫరా నిలిపివేశారు. గురువారం ఉదయం ఆరు గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు అంటే 24 గంటల వరకు తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్టు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు వెల్లడించింది. 
 
ఈ నిర్ణయం కారణంగా తాగునీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలను పరిశీలిస్తే, శాస్త్రీ పురం, బండ్లగూడ, భోజగుట్ట, అల్లబండ, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, ప్రశాసన్ నగర్, తట్టిఖానా, లాలాపేట్, సాహెబ్ నగర్, ఆటో నగర్, సైనిక్ పురి, మౌలాలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్, స్నేహగిరి, స్నేహగిరి, దేవేంద్ర నగర్, మధుబన్, దుర్గా నగర్, బుద్వేల్, సులేమాన్ నగర్, కిస్మత్పూర్, గంధం గూడ, బోడుప్పల్, మల్లికార్జున నగర్, చెంగిచెర్ల, భరత్ నగర్, పీర్జాదిగూడ మరియు ధర్మసాయి (శంషాబాద్) ప్రాంతాలు ఉన్నాయి. 
 
అలాగే, హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-3లో 2375 ఎంఎం డయామ్స్ పంపింగ్ మెయిన్‌లో లీకేజీ ఏర్పడిందని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ బుధవారం పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ లీకేజీని అరికట్టేందుకు మరమ్మతు పనులు చేపట్టాలని, ఈ 24 గంటల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, ప్రభావిత ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా ఉపయోగించాలని జలమండలి కోరింది.