శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (16:48 IST)

రేవంత్ రెడ్డి లీకుల వీరుడు.. దొంగల ఫోన్‌లను ట్యాప్ చేస్తారు.. కేటీఆర్

ktrao
వివాదస్పద ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చని ఒప్పుకున్న కేటీఆర్.. ఒకరిద్దరు ఫోన్లు పోలీసులు ట్యాప్ చేసి ఉండొచ్చని అన్నారు. దొంగల ఫోన్ కాల్‌లను పోలీసులు ట్యాప్ చేస్తారని అతను వాదించారు.
 
డ్రామాలు, హంగామా చేయడాన్ని మించి కాంగ్రెస్ ఏమీ చేయబోదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లీకుల వీరుడు (లీకింగ్ స్టార్)గా అభివర్ణించారు. ఒకరిద్దరు ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైనట్లు కేటీఆర్‌ ఒప్పుకోవడంతో కాంగ్రెస్‌ నేతల ఆరోపణలకు మరింత బలం చేకూరింది. మొత్తానికి ఎపిసోడ్ ఎక్కడ ముగుస్తుందో చూడాలి. 
 
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు, సస్పెండ్ చేయబడిన డీఎస్పీ ప్రణీత్ రావు, మరికొందరు పోలీసు అధికారులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌లో కీలక వ్యక్తులుగా అనుమానిస్తున్నారు.