Stray Dogs: వీధికుక్కలతో తంటాలు.. వరంగల్‌లో వ్యక్తిని వెంబడించాయి.. డ్రైనేజీలో పడి మృతి
వీధికుక్కలతో ఇబ్బందులు తప్పట్లేదు. వరంగల్ జిల్లా హన్మకొండలో 24 ఏళ్ల ఆదేప్ శివకుమార్ పని నుండి ఇంటికి తిరిగి వస్తుండగా విషాద సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. మచ్చాపూర్ గ్రామం సమీపంలో, వీధి కుక్కలు అతని బైక్‌ను వెంబడించాయి. భయంతో, అతను బండిని వేగంగా దూసుకెళ్లి, నియంత్రణ కోల్పోయి, డ్రైనేజీ గుంటలో పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మరణించాడు. స్థానికలు ఎంత ప్రయత్నించినా అతన్ని రక్షించలేకపోయారు.
ఈ సంఘటన గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అనేక ప్రాంతాలలో వీధి కుక్కలు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని, రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని వారు చెబుతున్నారు.
వీధి కుక్కల జనాభాను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని స్థానికులు నిందించారు. సక్రమంగా స్టెరిలైజేషన్ చేయని కారణంగా వీధి కుక్కల సంఖ్య పెరుగుతోందని నివాసితులు చెబుతున్నారు.