KTR Defamation Case: బీజేపీ నేత బండి సంజయ్‌కు సమన్లు జారీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పుడు ఆరోపణలు చేసిన బీజేపీ నేత బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేత కేటీఆర్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. బండి సంజయ్ కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో వేరే దారిలేక కేటీఆర్ పరువు నష్టం దావా వేసి, క్షమాపణ చెప్పడానికి సమయం ఇచ్చారు.
కానీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ క్షమాపణలు చెప్పేందుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. డిసెంబర్ 15న హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే ఆగస్టులో కేటీఆర్ తనపై వ్యాఖ్యలు చేసినందుకు గాను బండి సంజయ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. రూ.10 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అయితే కేటీఆర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోను దుర్వినియోగం చేశారని, రాజకీయ నాయకులు, హైకోర్టు న్యాయమూర్తులు, రేవంత్ రెడ్డి ఫోన్‌లను కూడా ట్యాప్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. కేటీఆర్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయబడ్డాయి. ఇది తీవ్ర రాజకీయ చర్చలకు దారితీసింది.