శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2024 (18:17 IST)

బైకుపై వచ్చిన ముగ్గురు.. బాలుడిపై కత్తితో దాడి చేశారు.. ఎందుకు? (video)

Boy
Boy
హైదరాబాద్, కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని సబ్జీ మండి ప్రాంతంలో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పవన్ అనే బాలుడిపై కత్తితో దాడి చేశారు. దాడి జరిగిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో పవన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ బాలుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దాడికి పాల్పడిన వారి వివరాలు, దాడి వెనుక గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైందని, అధికారులు ఆధారాలు సేకరించేందుకు పరిశీలిస్తున్నారు.