Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు
Rajamouli, Varanasi maheshbabu
తెలుగులో సంచలన దర్శకుడు రాజమౌళి అంటే ఓ గౌరవం వుండేది. కానీ దానిని ఆయన చేతులారా వక్రీకరించుకునేట్లు చేశాడని ఫిలింనగర్ కథనాలు తెలియజేస్తున్నాయి. ఆయన సినిమా తీరు అందరినీ మురిపించాయి. అయితే ఆ క్రమంలో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ వారణాసి సినిమా ప్రమోషన్ ఆయనపై కేసులు పెట్టేదాకి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. పురాణాలు, ఇతిహాసాలు, కల్పితాలు చూపిస్తూ చివరికి అవే ఆయన మెడకు చుట్టేలా చేశాయి.
వారణాసి గ్లింప్స్‌లో మహేష్ బాబు నందిపై కూర్చోని కనిపించడంతో.. హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే నందిపై హీరోని కూర్చోబెట్టాడని ఒక కేసు
బాహుబలి ది ఎటర్నల్ వార్ ట్రైలర్‌లో బాహుబలి, ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నట్టుగా చూపించాడని రాజమౌళిపై మరో కేసు నమోదైనట్లు సమాచారం
ఇప్పటికే వారణాసి ఈవెంట్‌లో హనుమంతుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని రాజమౌళిపై సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ వానర సేన సంఘం. కాగా, దీనిపై ఇంతవరకు రాజమౌళి సోషల్ మీడియా ఎటువంటి కౌంటర్లు ఇవ్వలేదు.